: హైదరాబాదును ముంచెత్తిన వాన
హైదరాబాదు నగరాన్ని వర్షం ముంచెత్తింది. నేటి వేకువజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఉప్పల్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కుత్బుల్లాపూర్, షాపూర్, జీడిమెట్ల, చింతల్, సురారం కాలనీ, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, గోషామహల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పాతబస్తీ, కుషాయిగూడ, కాప్రా, సైనిక్ పురి, మలక్ పేట, మూసారంబాగ్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి ఈ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది.