: సముద్రంలో కూలిపోయిన మయన్మార్ మిలటరీ విమానం?
105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న మయన్మార్ మిలటరీ విమానం సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. మైయిక్, యాంగాన్ ప్రాంతాల మధ్యలో రాడార్ తో సంబంధాలు కోల్పోయిన ఈ విమానం...దవాయ్ పట్టణానికి పశ్చిమంగా 20 మైళ్ల దూరంలో గల్లంతైనట్టు గుర్తించారు. దీంతో ఆ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టగా, విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయక బృందాలు గుర్తించాయి. దీంతో విమానం సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని, ప్రయాణికులంతా జలసమాధయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.