: రేప‌టి మ్యాచ్ కోసం మైదానంలో క‌స‌ర‌త్తులు చేస్తున్న టీమిండియా ఆట‌గాళ్లు


పాకిస్థాన్ జ‌ట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా ఆట‌గాళ్లు రేపు శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కోసం ఈ రోజు మైదానంలో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు లండ‌న్‌లోని కిన్నింగ్ట‌న్ ఓవ‌ల్‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 3న శ్రీ‌లంక జ‌ట్టు సౌతాఫ్రికాతో త‌న మొద‌టి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 96 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. టీమిండియాతో రేపు జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో గెల‌వాల‌ని ఆ జ‌ట్టు కూడా క‌స‌ర‌త్తులు చేస్తోంది.

మ‌రోవైపు పాక్‌పై ఘ‌న‌విజ‌యం సాధించిన టీమిండియా అదే దూకుడును ప్ర‌ద‌ర్శించి శ్రీ‌లంక‌ను ఓడించి, సెమీస్ కు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్ప‌టికే అతిథ్య ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కు అర్హ‌త సాధించిన విష‌యం తెలిసిందే. టీమిండియా మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా తీసిన పలు ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.                                



  • Loading...

More Telugu News