: వాట్సప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ లు!


వినియోగ‌దారులు గ్యాస్ సిలిండ‌ర్లను బుక్ చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రింత సుల‌భ‌తరమైన విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు అత్య‌ధికంగా ఉప‌యోగిస్తున్న యాప్ వాట్స‌ప్ ద్వారా ఇక‌పై బుకింగ్‌లు చేసుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చూస్తోంది. ఇందుకోసం ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయ‌నుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన‌ నియమ, నిబంధనల రూపకల్పన జరుగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇందు కోసం అధికారులు వివిధ గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జ‌రుపుతున్నారు.                  

  • Loading...

More Telugu News