: వీహెచ్ ఇచ్చిన గిఫ్ట్ ను వేలం వేస్తున్నా: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ సూచన మేరకు జగ్గారెడ్డికి వి.హనుమంతరావు తన బంగారు బ్రేస్ లెట్ ను బహుమతిగా ఇచ్చారు. అయితే, వీహెచ్ బహుమతిగా ఇచ్చిన బ్రేస్ లెట్ ను వేలం వేయనున్నట్టు నేడు జగ్గారెడ్డి తెలిపారు. 10వ తేదీన గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి సమక్షంలో వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఖమ్మంలో బేడీలు వేసిన రైతులకు ఆర్థికసాయంగా అందిస్తామని తెలిపారు.