: సీపీఎం నేత సీతారాం ఏచూరిపై దాడికి యత్నించిన యువకులు
సీపీఎం నేత సీతారాం ఏచూరిపై ఈ రోజు పలువురు యువకులు దాడికి యత్నించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుండగా... అక్కడకు వచ్చిన పలువురు యువకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారు. తనపై దాడికి యత్నించిన యువకులపై సీతారాం ఏచూరి మండిపడ్డారు. సంఘ్ గూండాగిరికి తాను భయపడబోనని అన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఉద్ఘాటించారు.