: వచ్చే ఎన్నికల్లో 'కింగ్' నేనే: గద్దర్ నోట కీలక మాట


మరో రెండేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో 'కింగ్' తానేనని ప్రజా గాయకుడు గద్దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, పార్టీ నుంచి తప్పుకున్నానే తప్ప, జెండాను కిందపడవేయకుండా ఓట్ల విప్లవం వైపు పయనిస్తున్నానని అన్నారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమేనని, త్యాగాల తెలంగాణ ఎంతమాత్రమూ కాదని అభిప్రాయపడ్డారు. కేవలం పాలకులు మారారే తప్ప ప్రజల జీవితాలు మారలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు పొత్తులు ఉంటాయని, బడుగు, బలహీన వర్గాల ప్రజలు రాజకీయ చైతన్యంతో ఆలోచించి ఓట్లు వేయాలని గద్దర్ కోరారు. తన లక్ష్యం నెరవేరేంత వరకూ పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేసిన ఆయన, తెలంగాణలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను రద్దు చేయడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News