: తెలంగాణలో వేల కోట్ల రూపాయల భూములు కబ్జాకు గురవుతున్నాయి: టీడీపీ నేత రమణ


తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల భూములు కబ్జాకు గురవుతున్నాయని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. జగిత్యాలలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, భూ కుంభకోణాల కేసులో అరెస్టయిన ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓ చిన్న చేప అని, ఇంకా తిమింగలాలు ఉన్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ అనుచరులే తెలంగాణలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆరేనని, ప్రగతి భవన్ అనే కొత్త గఢీ నుంచే పాలన సాగుతోందని విమర్శించారు. బేడీలు వేయాల్సింది రైతులకు కాదని భూకబ్జాదారులకని రమణ అన్నారు.

  • Loading...

More Telugu News