: నేడు విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన.. వీసా కార్డు ప్రతినిధులతో భేటీ!
ఏపీ మంత్రి లోకేష్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలో వీసా కార్డు కంపెనీ ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నొవాటెల్ హోటల్ లో ఈ సమావేశం జరగనుంది. విశాఖను నగదు రహిత లావాదేవీల నగరంగా తీర్చిదిద్దే అంశంపై వీసా కార్డు ప్రతినిధులతో లోకేష్ చర్చించనున్నట్టు సమాచారం.