: నరేంద్ర మోదీ పాత్రకు నేనే కరెక్టు: నటుడు పరేష్ రావెల్


ఒకవేళ ప్రధాని మోదీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ కనుక తీస్తే, ఆయన పాత్రలో తాను తప్ప ఇతర నటులెవ్వరూ నటించలేరని బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావెల్ అన్నారు. మోదీకి, తనకు పోలికలు ఉన్నాయని, ఆయన అభిప్రాయాలు, ఆలోచించే తీరు కూడా తన మనస్తత్వానికి దగ్గరగా ఉంటాయని అన్నారు. పరేష్ రావెల్ నటించిన ‘గెస్ట్ ఇన్ లండన్’  హిందీ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి వ్యక్తికి, ప్రతి నేతకి మోదీ లక్షణాలు ఉండాలన్నది తన అభిప్రాయమని అన్నారు. అవినీతి అంటే ఎరుగని ఒక వ్యక్తి మన దేశ ప్రధాని కావడం గర్వకారణమని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. 

  • Loading...

More Telugu News