: నీ జీవితానికి నిజంగానే 'నువ్వే రాజు.. నువ్వే మంత్రివి'!: రానాకు రకుల్ ప్రీత్ సింగ్ కితాబు
హీరో రానా నటిస్తోన్న కొత్త చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. రానా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్న ఈ టీజర్ ఆ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. 'నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా.. అలాగే నువ్వు ఎప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా' అంటూ రానా చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ టీజర్‌పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ టీజర్‌పై స్పందించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ‘నీ జీవితానికి నిజంగా నువ్వే రాజు.. నువ్వే మంత్రివి’ అని తన ట్విట్టర్ ఖాతాలో రానాని ఉద్దేశించి పేర్కొంది. ఈ టీజర్ అద్భుతంగా ఉందని చెప్పింది.
nee jeevitaan ki really nuvve Raju nuvve mantri!!