: పొట్టి డ్రస్సు వేసుకుని పెళ్లి పీటలపై పంజాబీ వధువు... పెను సంచలనం సృష్టిస్తూ వైరల్ అవుతున్న వీడియో ఇది!


పెళ్లంటే... ఒళ్లు మోయలేనంత ఆభరణాలు, బరువైన లెహంగా, ఆకర్షణీయంగా కనిపించేలా మేకప్... సాధారణంగా వధువు కనిపించే తీరిది. కానీ ఓ పంజాబీ అమ్మాయి చేసిన పనిప్పుడు వైరల్ అవుతోంది. ఆమె పెళ్లి ఫోటోలు నెట్టింట దూసుకెళుతున్నాయి. అందమైన లెహంగాను ధరించాల్సిన ఆ వధువు ఎవరూ ఊహించని విధంగా ఓ పొట్టి డ్రస్సుతో వచ్చేసింది. సంప్రదాయ వధువు ధరించే చోలీ, బంగారు ఆభరణాలు, దుప్పట్టాలను వేసుకుని లెహంగా స్థానంలో నైకీ బ్లాక్ షార్ట్స్ తో వచ్చి పెళ్లిలో పాల్గొంది. వరుడి ముందు అలాగే తిరిగి, అతని మెడలో వరమాల వేసింది. కొంతమంది ఆమె చేసిన పనిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇదేం చోద్యమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియోలో కొంత భాగాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News