: అదుర్స్... అల్లు అర్జున్‌ ‘డీజే’ ట్రైల‌ర్‌కు ఒక్క గంట‌లో ల‌క్ష క్లిక్స్!


స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 7.30 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నామ‌ని ఈ సినిమా యూనిట్ ఈ రోజే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సాధార‌ణంగా అన్ని సినిమాల ట్రైల‌ర్ల తేదీని కొన్ని రోజుల ముందుగానే చెప్పేస్తారు. అలా చేస్తే ఆ ట్రైల‌ర్ పై ఆస‌క్తి పెరిగి, ఎక్కువ క్లిక్స్ వ‌స్తాయ‌ని భావిస్తారు. అయితే, బ‌న్నీ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్నామ‌ని ఈ రోజే ప్ర‌క‌టించినా డీజే ట్రైల‌ర్ దుమ్ముదులిపేస్తోంది. ఈ రోజు రాత్రి 7.30కు విడుదల చేసిన బన్నీ కొత్త సినిమా ట్రైలర్ అప్పుడే లక్ష క్లిక్కులను దాటేసింది. ఇందులో బన్ని స్టైల్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు.

మరోపక్క, బన్నీ ట్రైలర్ కు ఎప్పటిలాగే  యాంటీ ఫ్యాన్స్ నుండి డిస్ లైక్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ ట్రైలర్ కు ఏకంగా పదివేల మందికి పైగా డిస్ లైక్ లు కొట్టారు. బన్నీ ట్రైలర్ లకు కొందరు అదేపనిగా చేసుకొని డిస్ లైక్స్ కొడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.



  • Loading...

More Telugu News