: మా ఆయనతో మూడు నెలలు మాట్లాడలేదు: నటి శ్రీదేవి
ప్రముఖ నిర్మాత, తన భర్త అయిన బోనీ కపూర్ తో మూడు నెలల పాటు మాట్లాడేందుకు కుదరలేదని ప్రముఖ నటి శ్రీదేవి చెప్పారు. ‘మామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం పొద్దున్నే వెళ్లిపోయేటప్పుడు ‘గుడ్ మార్నింగ్’ అని, రాత్రికి ‘గుడ్ నైట్’ అని తన భర్తకు మెసేజ్ చేసే దాన్నని అన్నారు. ఆ మెస్సేజ్ లు తప్పా ఒక్కమాట కూడా తన భర్తతో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఏ సినిమాకు పని చేసేటప్పుడైనా తాను దర్శకుడికి సరెండర్ అయిపోతానని, తాను దర్శకుడు దిద్దిన నటినని శ్రీదేవి అన్నారు. వచ్చే నెల 7వ తేదీన ‘మామ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.