: విశాఖ జిల్లాలో భూ బకాసురులు పేట్రేగిపోతున్నారు: సీపీఐ నేత రామకృష్ణ


విశాఖ జిల్లాలో భూ బకాసురులు పేట్రేగిపోతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడుకి ఆయన ఓ లేఖ రాశారు. విశాఖ రూరల్, భీమునిపట్నం మండలాల్లో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, మధురవాడలో పది ఎకరాల ప్రభుత్వ భూమికి టీడీపీ నేత తప్పుడు పట్టా సృష్టించి అమ్మేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని ఆ లేఖలో రామకృష్ణ కోరారు.

  • Loading...

More Telugu News