: మనిషిని పోలిన తల.. వింత ఆకారంతో జన్మించిన ఆవు దూడ!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వింత ఆకారంలో ఆవుదూడ జన్మించింది. ఆ దూడకు మనిషి తలను పోలిన ఆకారం ఉండడం విశేషం. దానికి మనిషి లాగే ముక్కు, కళ్లు, చెవులు ఉన్నాయి. దీంతో విష్ణుమూర్తి అవతారంలో ఆ దూడ ఉందని ప్రచారం జరగడంతో దానికి స్థానికులు పూజలు చేస్తున్నారు. అయితే, ఆ దూడ జన్మించిన కొద్ది సేపటికే మృతి చెందింది. ఆ దూడను ఒక శవపేటికలో ఉంచిన స్థానికులు దానికి పూల దండలు వేశారు. ఈ వింత దూడ గురించి మాట్లాడిన పశు వైద్యులు జన్యులోపం వల్లే ఇటువంటి పశువులు జన్మిస్తాయని అన్నారు. స్థానికులు మాత్రం పూజలు ఆపడం లేదు.