: మేము అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టం: విశాఖ భూ కుంభకోణంపై విజయసాయిరెడ్డి


విశాఖలో భూ కబ్జాకు పాల్పడిన టీడీపీ నేతలను వదిలిపెట్టమని, తాము అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి దోచుకున్న సొమ్మును రికవరీ చేసి పేదలకు పంచుతామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో భూ కబ్జా వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని, వీళ్లందరికీ నారా లోకేష్ నాయకుడిగా ఉన్నారని ఆరోపించారు. కేవలం విశాఖలోనే లక్ష ఎకరాల భూములను టీడీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News