: కుట్రేమీ లేదు.. చట్టం తన పని చేసుకుపోతుంది: వెంకయ్యనాయుడు
ఎన్డీటీవీకి వ్యతిరేకంగా సాగిస్తున్న కుట్రలో భాగంగానే సంస్థ కో చైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంట్లో సీబీఐ దాడులు చేసిందంటూ ఆ సంస్థ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ‘‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయంలో ప్రభుత్వం తలదూర్చదు. ఇందులో ఎటువంటి కుట్ర లేదు’’ అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సీబీఐ దాడులు చేయడం వెనుక తగినంత సమాచారం కచ్చితంగా ఉండి ఉంటుందన్నారు. ఐసీఐసీఐ బ్యాంకుకు భారీగా నిధుల నష్టం కలిగించారంటూ సీబీఐ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ప్రణయ్ రాయ్ నివాసంలో సోదాలకు దిగిన విషయం తెలిసిందే.