: దాడులకు తలొగ్గేది లేదు... దేశం కోసం పోరాటం కొనసాగుతుంది: ఎన్డీటీవీ


తప్పుడు ఆరోపణలతో గతంలో మాదిరిగానే ఎన్డీటీవీ, దాని ప్రమోటర్లను వేధించే చర్యలను సీబీఐ చేపట్టినట్టు ఆ సంస్థ ఆరోపించింది. సీబీఐ ఈ రోజు ఎన్డీటీవీ కో చైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంటిపై దాడులు చేసిన నేపథ్యంలో సంస్థ ఓ ప్రకటన రూపంలో తన స్పందన తెలియజేసింది. ఒకటికి మించిన దర్యాప్తు ఏజెన్సీల ద్వారా చేపట్టిన ఈ దాడులకు వ్యతిరేకంగా ఎన్డీటీవీ, సంస్థ ప్రమోటర్లు విరామం లేకుండా పోరాటం చేస్తారని పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచే, భావ ప్రకటనా స్వేచ్ఛకు నష్టం కలిగించే ఈ దాడులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది. దేశంలోని సంస్థలను నాశనం చేయాలనుకునే వారికి తామిచ్చే సందేశం ఒకటేనని, దేశం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ శక్తులపై విజయం సాధిస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News