: టాలీవుడ్ లోకి గాలి జనార్దన్ రెడ్డి.. కొడుకు హీరోగా భారీ చిత్రనిర్మాణం!


అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం గడిపి, బెయిల్ పై బయటకు వచ్చిన బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. త్వరలోనే ఆయన ఓ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పబోతున్నారు. సొంత బ్యానర్ లో తన కుమారుడు కిరీట్ రెడ్డి హీరోగా భారీ ఎత్తున సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కనుంది. ఇప్పటికే కిరీట్ రెడ్డి నటన, డ్యాన్స్ లలో శిక్షణ పొందాడు. సినిమా కథను ఫైనల్ చేసే పనిలో ఇప్పటికే గాలి ఫ్యామిలీ బిజీగా ఉందట. రాజకీయాల్లో సైతం మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించేందుకు గాలి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News