: రైలులో బెర్త్ ఆక్రమణ.. ప్రయాణికుడికి రూ.75 వేలు చెల్లించాలని రైల్వేను ఆదేశించిన వినియోగదారుల కమిషన్!


రిజర్వేషన్ చేయించుకున్న బెర్త్‌ను వేరే వ్యక్తులు ఆక్రమించుకున్న ఘటనలో బాధిత ప్రయాణికుడికి రూ.75 వేలు చెల్లించాలంటూ ఇండియన్ రైల్వేను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన విజయ్‌ కుమార్ మార్చి 30, 2013లో విశాఖపట్టణం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బెర్త్ రిజర్వు చేసుకున్నారు. రైలు మధ్యప్రదేశ్‌లోని బినా స్టేషన్‌కు చేరుకున్నాక విజయ్ కుమార్ సీటును వేరే వ్యక్తులు ఆక్రమించుకున్నారు. అతడితోపాటు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు.

 ఈ విషయాన్ని టీసీ, రైల్వే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లేందుకు విజయ్ కుమార్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో బాధిత ప్రయాణికుడికి రూ.75 వేలు పరిహారంగా ఇవ్వాలని, ఆ మొత్తంలో మూడింట ఒక వంతును టీసీ వేతనం నుంచి చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. అయితే ఫోరం ఆదేశాలను రైల్వే అమలు చేయకపోవడంతో విజయ్ కుమార్ ఢిల్లీ స్టేట్ కన్జుమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ కమిషన్ (ఎస్‌సీడీఆర్‌సీ)ని ఆశ్రయించారు. జిల్లా ఫోరం ఆదేశాలను సమర్థించిన కమిషన్ తాజాగా ఇండియన్ రైల్వేకు ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది.

  • Loading...

More Telugu News