: వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంచు మించు దానకర్ణుడే!: ముద్రగడ పద్మనాభం
వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంచు మించు దానకర్ణుడే అని, ఆ కోవకు చెందిన వాడేనని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ కార్యక్రమం కావాలంటే ఆ కార్యక్రమం చేబట్టి, ప్రజలను ఆకట్టుకుని, ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డని అన్నారు. అలాగే, ఎన్టీరామారావు కూడా చాలా గొప్ప వ్యక్తి అని అన్నారు. మిగిలిన ముఖ్యమంత్రులెవ్వరూ తనను అంతగా ఆకట్టుకోలేదన్నారు. చంద్రబాబు విషయాని కొస్తే, గంటలకొద్దీ మీటింగ్ లు పెడతారని, అవుట్ పుట్ మాత్రం ఏముండదని, నటిస్తారని, సొల్లు చెబుతారని, చెప్పిందే చెబుతారని విమర్శించారు.