: రాహుల్ ఫ్లెక్సీలపై నల్లరంగు పోసిన తెలుగు తమ్ముళ్లు!


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ గుంటూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ కు ఆహ్వానం పలుకుతూ గన్నవరంలో ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, రాహుల్ రాకను నిరసిస్తూ ఆయన ఫ్లెక్సీలపై టీడీపీ కార్యకర్తలు నల్లరంగు పోశారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

  • Loading...

More Telugu News