: షాక్ కు గురయ్యా.. లండన్ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: మోదీ
లండన్ లో నిన్న రాత్రి ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఉగ్రదాడి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన వార్త వినగానే షాక్ కు గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. టెర్రరిస్టుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.