: లండన్ ఉగ్రదాడిలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య.. ముగ్గురు టెర్రరిస్టుల హతం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ బ్రిడ్జిపై అత్యంత వేగంతో వ్యాన్ నడుపుతూ పాదచారులను ఢీకొంటూ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఆ తర్వాత మార్కెట్ ఉన్న ఓ ప్రదేశంలో వ్యాన్ ను ఆపి, కిందకు దిగి, పక్కనే ఉన్న బార్లు, రెస్టారెంట్లపై దాడులు జరిపారు. ఈ రెండు ఘటనల్లో ఇప్పటి వరకు ఆరుగురు పౌరులు మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు కాల్చి చంపారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు రెండుసార్లు నెత్తుటి ఏర్లు పారించడంతో... లండన్ పౌరులు భయంతో వణికిపోతున్నారు. ఈ దాడులను లో-టెక్, హై-ప్రొఫైల్ దాడులుగా అభివర్ణిస్తున్నారు.