: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుమన్!
ప్రముఖ సినీ నటుడు సుమన్ రాజకీయాల్లోకి రానున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ... తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, మంచి పార్టీ వస్తే, అందులో చేరి రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, నిన్న పలాసకు వెళ్లిన సుమన్ శివాజీని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన పొలిటికల్ ఎంట్రీ గురించి పైవిధంగా స్పందించారు.