: భారత్, పాక్ మ్యాచ్ పై ఐఎస్ఐ కన్ను... ఇంగ్లండ్ చేరుకున్న 14 మంది ఏజెంట్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ఈ రోజు కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ పై పాక్ గుఢచార సంస్థ ఐఎస్ఐ కన్ను పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... దాదాపు 14 మంది ఐఎస్ఐ ఏజెంట్లు ఈ మ్యాచ్ ను చూసేందుకు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కశ్మీర్ వివాదానికి సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించేందుకు ఐఎస్ఐ వీరిని పంపించింది. కశ్మీర్ కు స్వాత్రంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించాలని ఐఎస్ఐ వారి ఏజెంట్లను కోరిందట. ఈ ప్లకార్డుల్లో పలు రకాల నినాదాలు ఉన్నాయని సమాచారం. కశ్మీర్ రక్తం చిందిస్తోంది... ప్రపంచమంతా తన వైపు చూడాలని కశ్మీర్ కోరుకుంటోంది... కశ్మీర్ కు స్వాతంత్ర్యం ఇవ్వాలి... కశ్మీర్ కు మేము అండగా నిలుస్తాం... తదితర నినాదాలు ప్లకార్డుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.