: భారత కంప్యూటర్లలోకి చొరబడుతున్న చైనా వైరస్!
రాన్సమ్ వేర్ 'వాన్నా క్రై' వైరస్ దాడిని మరువక ముందే... మరో పెద్ద సమస్య వచ్చి పడింది. తాజాగా చైనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే, ఈ వైరస్ ఎక్కువ ప్రభావాన్ని భారత్ లోనే చూపిస్తోందట. ఈ వైరస్ సోకిన కంప్యూటర్లలోని మొత్తం సమాచారం వారి సర్వర్ కు చేరిపోతుంది. చివరకు బ్యాంకు వివరాలు, రహస్య సమాచారం కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది.
భారత్ లోని కార్పొరేట్ సంస్థల్లో ఉన్న 43 శాతం పీసీలకు ఇప్పటికే ఈ వైరస్ వ్యాపించిందని 'చెక్ పాయింట్' అనే సంస్థ వెల్లడించింది. భారత్ తో పాటు బ్రెజిల్ కూడా ఈ వైరస్ వల్ల ఎక్కువ ప్రభావితమయిందని తెలిపింది. అవసరం ఉన్నా, లేకపోయినా బలవంతంగా ప్రకటనలను గుప్పిస్తూ... యూజర్లను లక్షిత వెబ్ సైట్ కు ఈ వైరస్ మళ్లిస్తుంది.