: భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్.. దర్యాప్తు ప్రారంభించిన భారత్
భారత గగనతలాన్ని చైనా మరోమారు ఉల్లంఘించింది. ఆ దేశానికి చెందిన హెలికాప్టర్ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించింది. సైనో-ఇండియా సరిహద్దులోని భరాహోటి ప్రాంతంలో అనుమానిత చైనా హెలికాప్టర్ కనిపించినట్టు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన చాపర్ నాలుగు నిమిషాల పాటు చక్కర్లు కొట్టినట్టు చమోలీ ఎస్పీ త్రిపాఠీ భట్ తెలిపారు. గతంలోనూ చైనా ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు. అయితే చైనా ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయం తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్పీ తెలిపారు.