: పవన్ కల్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికలు ఎంతో కీలకమని ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదాపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి తమ పార్టీ హోదాకు మించిన ప్యాకేజీని కల్పించిందని చెప్పారు. పవన్ హోదానే పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. 2014లో పవన్ తమకు సహకరించారని, 2019వరకు ఆయనను గుర్తుంచుకుంటామని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సాయం చేస్తోందని ఆయన చెప్పారు.