: స్మగ్లింగ్ తో లింకులు... విదేశీయుల సమాచారంతో జాతీయ షూటర్ అరెస్టు!


సరైన అనుమతుల్లేకుండా 4.5 కోట్ల రూపాయల విలువైన 25 మారణాయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ముఠాను గత ఏప్రిల్ 29న ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ముఠాలోని ముగ్గురు విదేశీయులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులు...వారిచ్చిన సమాచారంతో మీరట్ లోని జాతీయ షూటర్ ప్రశాంత్ బిష్ణోయ్ నివాసంలో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంలో కోటి రూపాయల నగదు, విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఇంపోర్టెడ్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు 117 కేజీల మనుబోతు మాంసం, కొమ్ములు, చిరుతపులి, కృష్ణజింకల చర్మాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ బిష్ణోయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆయుధాలు, వన్యప్రాణుల అక్రమ రవాణా (స్మగ్లింగ్‌)కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ప్రశాంత్‌ బిష్ణోయ్‌ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

  • Loading...

More Telugu News