: ఛాంపియన్స్ ట్రోఫీ: 2013లో జరిగిందే 2017లో పునరావృతమైంది!


ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గతంలో 2013లో జరిగిన సంఘటనే 2017లో పునరావృతమైంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో బర్మింగ్ హామ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. నిన్న అదే మైదానంలో అవే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా అదే కారణంతో రద్దైంది. దీంతో అప్పట్లానే రెండు జట్లకు ఐసీసీ చెరొక పాయింట్ కేటాయించింది.

కాగా, బర్మింగ్ హామ్ వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కు 9.3 ఓవర్ లో వర్షం అడ్డం పడింది. ఓపెనర్లు రోంచి (65), గుప్టిల్ (26), శుభారంభం ఇచ్చారు. అనంతరం కెప్టెన్ విలియమ్సన్ (100) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం టేలర్ (46) కూడా రాణించడంతో 45 ఓవర్లలో 291 పరుగులు చేసింది. అనంతరం మరోసారి వరుణుడి రాకతో ఆలస్యంగా 33 ఓవర్లలో 235 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కేవలం 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఇంతలో మరోసారి వర్షం ఆటకు అంతరాయం కల్పించింది. ఈసారి ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో రిఫరీ తన అంపైర్లతో చర్చించి మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News