: నేవీ ఉద్యోగి తాట తీసిన వైజాగ్ యువతి!


వైజాగ్ లోని నేవీ ఉద్యోగిని ఓ యువతి చెప్పుతో కొట్టిన ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణంలోని మల్కాపురంలో నివాసం ఉంటున్న నేవీ ఉద్యోగి సందీప్ నర్వాల్... అదే ప్రాంతంలో ఉంటున్న ఓ యువతి స్నానం చేస్తుండగా, ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన ఆ యువతి తన బంధువుల సాయంతో అతనిని పట్టుకుని చెప్పుతో కొట్టి బుద్ది చెప్పింది. అనంతరం అతనిని మల్కాపురం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. దీంతో పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News