: పశువధ నిషేధంపై బెంగళూరులో భారీ ఎత్తున ఆందోళన.. పలువురి అరెస్ట్
దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలపై బెంగళూరులో ఆందోళనలు నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున బెంగళూరు వాసులు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఆ నగర రోడ్లపైకి వచ్చి కేంద్ర సర్కారు తీరుకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం చెలరేగింది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.