: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. జగ్గారెడ్డికి హైదరాబాద్ లో గుండుకొట్టి ఊరేగిస్తాం: బాల్క సుమన్ హెచ్చరిక


కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. ఆ పార్టీ నేత‌లు జగ్గారెడ్డి, మధుయాష్కీలు చేస్తోన్న ఆరోప‌ణ‌లను సుమ‌న్ తిప్పికొట్టారు. వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చ‌రించారు. త‌మ ప్ర‌భుత్వంపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోబోమ‌ని చెప్పారు. సంగారెడ్డి నేత‌ జగ్గారెడ్డి ప్రవర్తన మార్చుకోకపోతే ఆయ‌న‌కు హైదరాబాద్‌లో గుండు కొట్టించి ఉరేగిస్తామని వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్‌లోని మియా‌పూర్‌లో వెలుగులోకి వ‌చ్చిన అతిపెద్ద‌ భూ కుంభకోణాన్ని తామే మొద‌ట‌ బయట పెట్టామ‌ని సుమ‌న్ అన్నారు. కాంగ్రెస్ నేత‌లు ఆ అంశాన్ని సీబీఐకి అప్ప‌గించాల‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, వారి మాట‌లు తెలంగాణ పోలీస్‌ల‌ను అవమానించ‌డ‌మేన‌ని అన్నారు.            

  • Loading...

More Telugu News