: చలనచిత్ర పరిశ్రమకు విధించిన పన్ను తగ్గించండి: సినీనటుడు కమలహాసన్ విజ్ఞప్తి
వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ సవరణ బిల్లుని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్న విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమకు విధించిన 28శాతం పన్ను సరికాదని సినీనటుడు కమల హాసన్ అన్నారు. పన్ను అంతగా విధించడం వల్ల సినీ పరిశ్రమ కుదేలయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పన్ను శ్లాబ్‌ను తగ్గించాలని కోరారు.
మరోవైపు రేపు ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మరోసారి జీఎస్‌టీ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొంటారు. ఇందునిమిత్తం తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జీఎస్‌టీ నిబంధనల్లో మార్పులు ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు.