: ఛాంపియన్స్ ట్రోఫీలో సమఉజ్జీల సమరం: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో మ్యాచ్‌లో సమఉజ్జీలు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్ లో జరుగుతోంది. ఇరుజట్లు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ లో టఫ్ ఫైటే జరుగుతుందని విశ్లేషకుల అభిప్రాయం. నిన్న జరిగిన ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కష్టపడినప్పటికీ చివరికి ఇంగ్లండ్‌నే విజయం వరించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ట్రోఫీలో రేపు శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి.