: మోదీని తెలివి తక్కువ ప్రశ్న అడిగి సంస్థ పరువు తీసిన రిపోర్టర్!
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని అక్కడి నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలో పనిచేసే ప్రముఖ రిపోర్టర్ మెగిన్ కెల్లీ తిక్క ప్రశ్న అడిగి... తను పని చేస్తున్న సంస్థ పరువు తీసింది. మోదీని ఆమె అడిగిన ప్రశ్న ఏమిటంటే... 'మీకు ట్విట్టర్ ఖాతా ఉందా?' అని. దీంతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్ల ముందు పరువు పోగొట్టుకుంది. ట్విట్టర్లో 3.3 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్న మోదీని... కేవలం 23 లక్షల మంది ఫాలోయర్లు మాత్రమే ఉన్న కెల్లీ ఈ ప్రశ్న అడగడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. అత్యధిక ఫాలోయర్లు ఉన్న దేశాధినేతల్లో మోదీ మూడో స్థానంలో ఉన్నారని... అలాంటి వ్యక్తిని ఇలాంటి ప్రశ్న అడుగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ చేసేముందు సరైన హోం వర్క్ చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. అయితే, కెల్లీ అడిగిన ప్రశ్నకు మోదీ బిగ్గరగా నవ్వేశారు.