: వేదికపై కుప్పకూలిన కారణాన్ని స్వయంగా చెప్పిన కడియం శ్రీహరి
ఈ ఉదయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ, వరంగల్ లో జరిగిన సభలో ప్రసంగిస్తూ, కుప్పకూలిన కడియం శ్రీహరి, ఆపై అరగంటకు కోలుకుని తిరిగి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం తాను అల్పాహారం తినలేదని, ఓ వైపు ఎదురెండ, మరోవైపు నీరసం కారణంతోనే కళ్లు తిరిగి పడిపోయానని తెలిపారు. వేదికపై మాట్లాడుతూ, తన సిబ్బందిని మంచి నీరు అడిగి తీసుకుని తాగిన కడియం, ఆపై క్షణాలకే, ముందున్న మైకులపై వాలిపోతూ కింద కూలబడగా, పక్కనే ఉన్న అధికారులు టెన్షన్ పడ్డారు. ముఖంపై నీళ్లు చిలకరించి, కాసేపు సపర్యలు చేసి, కారులో ఏసీ వేసి కూర్చోబెట్టిన తరువాత కడియం కోలుకున్నారు. తిరిగి వచ్చి గౌరవ వందనం స్వీకరించారు. కడియం అస్వస్థత గురించి తెలుసుకున్న కేసీఆర్, ఆయన్ను ఫోన్ లో పరామర్శించారు.