: పాక్ ను తీసి పారేయకండి...నాణ్యమైన ఆటగాళ్లున్నారు: మెక్ గ్రాత్


పాకిస్థాన్ జట్టును తక్కువగా అంచనా వేయవద్దని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ టీమిండియా ను హెచ్చరించాడు. చెన్నైలో ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ లో యువకులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన మెక్ గ్రాత్ మాట్లాడుతూ, పాకిస్థాన్ జట్టులో కూడా నాణ్యమైన ఆటగాళ్లున్నారని అన్నాడు. అయితే దాయాదుల పోరులో మాత్రం టీమిండియాదే విజయమని చెప్పాడు. గత మూడేళ్లుగా టీమిండియా బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉందని చెప్పాడు. పేస్, స్పిన్ ద్వయం సమతూకంతో ఉందని చెప్పాడు. బౌలర్లు జట్టుకు అవసరమైన ప్రదర్శన చేస్తూ రాణిస్తున్నారని కితాబునిచ్చాడు. బ్యాటింగ్ లో టీమిండియా ఎప్పూడు బలంగానే ఉందని చెప్పాడు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో రెండు జట్లు ఫైనల్ చేరుతాయని చెప్పాడు. 

  • Loading...

More Telugu News