: మూగజీవాల ఆకలి కేకలు... బక్కచిక్కిపోతున్న ఏనుగులు, జింకలు!
అభయారణ్యంలోని మూగజీవాలు ఆకలితో అలమటించిపోతున్నాయి. కర్ణాటకలోని నాగరహోళె అభయారణ్యంలో మూగజీవాలను ఆహార కొరత వేధిస్తోంది. దీంతో ఈ అభయారణ్యంలో ఉంటున్న ఏనుగులు, జింకలు, ఇతర జీవాలు ఆహారం దొరకక నకనకలాడిపోతున్నాయి. మరికొన్ని జంతువులు మైదాన ప్రాంతాలకు తరలుతున్నాయి. స్థానికంగా అడపాదడపా వానలు కురుస్తున్నప్పటికీ, ఆశించిన మేర కురవకపోవడంతో మూగజీవాలకు ఆహార కొరత ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ అభయారణ్యంలో తాగేందుకు అవసరమైన మంచి నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఆహారం దొరకక ఏనుగులు, జింకలు బక్కచిక్కిపోయాయి.