: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి 15 నోటిఫికేషన్లు
తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఈ రోజు తీపికబురు చెప్పారు. 2437 ఉద్యోగాలకు మొత్తం 15 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని, రేపటి నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు తమ వెబ్‌సైట్‌లో ఉంటాయని అన్నారు. విద్యాశాఖ నుంచి ఖాళీ వివరాలు రాగానే డీఎస్సీ ప్రకటన కూడా ఉంటుందని చెప్పారు.
అలాగే రేపు గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రేపు వెబ్‌సైట్‌లో ఉంచుతామని అన్నారు. గ్రూప్-1లో పలు పోస్టులకు 256 మందిని ఎంపిక చేస్తామని, గ్రూప్-2లో 1:3 పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. వారం రోజుల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్లు ఉంటాయని చెప్పారు. మొదట గ్రూపు 1 అభ్యర్థుల సర్టిఫికెట్లు, అనంతరం గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామని చెప్పారు.