: దీన్ని ‘స్పైడర్’ అని ఎందుకు అన్నారో మాకు ఇప్పుడు అర్థమైంది: రాజమౌళి
తెలుగు అగ్రనటుల్లో ఒకరైన మహేశ్‌బాబు నటిస్తున్న ‘స్పైడర్’ మూవీ చిత్రం ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు సీరియస్‌గా పనిచేసుకుంటుండగా ఓ రోబో స్పైడర్ ఆయనను డిస్టర్బ్ చేయడం, దీంతో మహేశ్ ‘ష్..’ అంటూ దాన్ని హెచ్చరించడం ప్రేక్షకులని బాగా అలరించేస్తోంది. ఈ ట్రైలర్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ సూపర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీన్ని ‘స్పైడర్’ అని ఎందుకు అన్నారో తమకు ఇప్పుడు అర్థమైందని, ఎంతో ఆసక్తికరంగా ఉందని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేర్కొన్నారు.
ఆ ట్రైలర్ అన్ని విధాలుగా పర్‌ఫెక్ట్‌గా ఉందని దర్శకుడు కొరటాల శివ అన్నారు. 'ష్... తుపాను వచ్చే ముందు అంతా నిశ్శబ్దమే' అని వంశీ పైడిపల్లి అన్నారు. హీరో నితిన్ స్పందిస్తూ.. ఈ టీజర్ తనకు బాగా నచ్చేసిందని పేర్కొన్నాడు. మహేశ్, మురుగదాస్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ ట్రైలర్‌ను నిన్నే విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతితో ఈ రోజుకి వాయిదా పడింది.