: టీడీపీతో పొత్తు వద్దంటూ అమిత్‌షా సభలో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై బీజేపీ చర్యలు!
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ విజయవాడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సొంత పార్టీ నేతలే ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీతో బీజేపీ పొత్తును వదులుకోవాలని, సింగిల్ గానే పోటీ చేయాలని పలువురు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలు చేశారు. ఈ విషయంపై ఈ రోజు ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించినవారు, ప్రోత్సహించిన నేతల వివరాలను తీసుకుంది. ఆ సభకు సంబంధించిన వీడియోలను పరిశీలించింది. ప్లకార్డులు ప్రదర్శించిన వారిని గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.