: లోకేష్ ఎదుగుదలను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: టీడీపీ నాయకురాలు అనురాధ
ఏపీ మంత్రి నారా లోకేష్ ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని టీడీపీ నాయకురాలు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఉన్నతమైన చదువులు చదివి, ప్రజాసేవ చేయడానికి లోకేష్ వచ్చారని చెప్పారు. ఒక మంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. లోకేష్ ఎదుగుదలను చూసి, ఓర్వలేకే ఆయనపై వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్విడ్ ప్రోకో ద్వారా లక్ష కోట్లను జగన్ దోచుకున్నారని విమర్శించారు. లోకేష్ పై అసత్య ఆరోపణలను ఆపకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.