: స‌మంత‌తో నా పెళ్లి విదేశాల్లో కాదు.. ఇక్కడే జరుగుతుంది: నాగచైతన్య


టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు మంచి స్పందన వస్తుండడంతో ఆ సినిమా యూనిట్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య‌ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త్వరలో జరగనున్న తన పెళ్లి విశేషాలను తెలిపాడు. రారండోయ్ అంటూ ఇప్ప‌టివ‌ర‌కు సినిమా కోసం పిలిచామ‌ని, ఇక త‌న‌ పెళ్లి వేడుక కోసం పిలుస్తామ‌ని అన్నాడు. ఈ ఏడాది అక్టోబరులోనే త‌న‌ పెళ్లి జ‌రుగుతుంద‌ని చెప్పాడు.

ఇక త‌మ పెళ్లి విదేశాల్లో జరుగుతుందని కొంద‌రు అనుకుంటున్నార‌ని, అయితే,  హిందూ, క్రైస్త‌వ‌ సంప్రదాయాల ప్రకారం స‌మంత‌తో త‌న పెళ్లి మ‌న‌ దేశంలోనే జరుగుతుందని చెప్పాడు. స‌మంత త‌న‌ అభిరుచుల్ని గమనించి తనను ప్రోత్సహిస్తుందని తెలిపాడు. తాను కూడా స‌మంత‌  అభిరుచుల విషయంలో అలాగే ఉంటాన‌ని చెప్పాడు. స‌మంత ఓ మంచి అమ్మాయని అన్నాడు. అలాగే అల్లరి అమ్మాయి అని కూడా అన్నాడు. సమంత త‌న‌కు ఏడేళ్లుగా మంచి స్నేహితురాల‌ని, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసని అన్నాడు. త‌మ పరిచయం, స్నేహం, ప్రేమ అన్నీ తీపిగుర్తులుగా త‌న మ‌దిలో ఎప్ప‌టికీ ఉండేపోయే విష‌యాల‌ని చెప్పాడు.

  • Loading...

More Telugu News