: వీడని బంధం: సమాధి నుంచి అన్న శవపేటికను తీసి.. ఊరంతా తిరిగిన తమ్ముడు!
బ్రెజిల్‌లో ఓ యువకుడు విచిత్రంగా ప్రవర్తించాడు. ఓ శవపేటికను బైక్‌పై పెట్టుకుని ఊరంతా తిప్పాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని పట్టుకొని విచారించి పలు విషయాలు తెలిపారు. 29 ఏళ్ల రోసా గత ఏడాది తన సోదరుడిని కోల్పోయాడు. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇన్నాళ్లూ తనకు తోడుగా, తన పక్కనే ఉన్న తన సోదరుడు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
దీంతో తన అన్నను ఖననం చేసిన ప్రదేశానికి వెళ్లిన రోసా ఆ సమాధి తవ్వి, అందులో ఉన్న శవపేటికను బైక్‌పై ఎక్కించుకుని ఊరంతా తిప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు మొదట అతడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోసా బైకుపై వేగంగా వెళ్లిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టుకు తరలించగా అక్కడి చట్టాల ప్రకారం న్యాయస్థానం అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.