: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ప్రారంభమైంది. గ్రూప్ ఏ లో ఉన్న ఇంగ్లండ్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు తొలిమ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లండన్‌లోని కిన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది.
గత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సాధించిన టీమిండియా ఈ సారి తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 4న పాకిస్థాన్ జట్టుతో ఆడనుంది.