: విమాన ప్రమాదంలో షారుఖ్ చనిపోయాడంటూ పుకారు!
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చనిపోయాడంటూ యూరప్ కు చెందిన పారిస్ టీవీ ఛానల్ ఓ వార్తను ప్రసారం చేసింది. బిజినెస్ పని మీద గల్ఫ్ స్ట్రీం జీ550 జెట్ లో పారిస్ కు వస్తుండగా... తీవ్ర గాలుల కారణంగా ఆ జెట్ కూలిపోయిందని... ఈ ప్రమాదంలో షారుఖ్ తో పాటు మరో ఏడుగురు చనిపోయారంటూ సదరు ఛానల్ ప్రసారం చేసింది. ఈ న్యూస్ కాస్తా వైరల్ కావడంతో... షారుఖ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. దీంతో, షారుఖ్ కు తెలిసినవారందరికీ ఈ ఉదయం నుంచి ఫోన్లు వెల్లువెత్తుతున్నాయట. మరోవైపు 'ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించకండి' అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో విన్నవిస్తున్నారు.