: ఓఎల్ఎక్స్, క్విక్కర్ లలో ఆవుల అమ్మకాలు
కబేళాలకు పశువులను అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రైతులు, పశు వ్యాపారులు తమ పశువుల అమ్మకాలకు మరో మార్గాన్ని వెతుక్కున్నారు. ఓఎల్ఎక్స్, క్విక్కర్ లాంటి వెబ్ సైట్ల ద్వారా ఆవులను అమ్మేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆవులను రైతులకే అమ్మాలి. మరోవైపు, కేంద్రం విధించిన నిషేధంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మధురైలోని మద్రాస్ హైకోర్టు బెంచ్ పశువధపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధంపై నాలుగు వారాల స్టే విధించింది.